గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 23 సెప్టెంబరు 2019 (16:00 IST)

టిక్ టాక్ చేస్తూ వాగులో దిగారు.. ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు..

టిక్ టాక్ మోజు ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. టిక్ టాక్‌లో వీడియో చేద్దామని చెరువులో దిగి ముగ్గురు యువకులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పుల కప్పవాగులో సంఘటన జరిగింది.
 
గోనుగొప్పుల గ్రామానికి చెందిన ముగ్గురు బిటెక్ విద్యార్థులు కప్పవాగులోకి  వచ్చారు. వర్షం ఎక్కువగా పడడంతో ఈ ప్రాంతంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో యువకులు ఉత్సాహంగా వాగులో దిగి టిక్ టిక్ వీడియో చేసేందుకు ప్రయత్నించారు.
 
అయితే ఒక్కసారిగా వరదనీరు ప్రవాహం పెరగడంతో ముగ్గురు యువకులు కొట్టుకుపోయారు. ఇద్దరు విద్యార్థులకు ఈత తెలియడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే దినేష్ అనే యువకుడు మాత్రం ఈత రాకపోవడంతో చనిపోయాడు. దినేష్ మ్రుతదేహాన్ని  స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారమిచ్చారు.