శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (13:39 IST)

తితిదే పాలకమండలిలో కేసీఆర్ బంధువులకే చోటు : సతీశ్ మాదిగ

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఏడుగురికి అవకాశం కలిపిస్తే అందులో ఐదు మందిని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచిస్తే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవ్వరూ లేరని టీపీసీసీ అధికార ప్రతినిధి దేవని సతీశ్ మాదిగ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

తితిదే పాలక మండలిలో మొత్తం కేసీఆర్ బంధువులు స్నేహితులు ఉన్నారు. మిగతా ఇద్దరు వైకాపాకి చెందినవారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల్లో తితిదే మండలిలో తెలంగాణ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశాలు ఇచ్చేవారు. చివరికి విభజన తర్వాత ఏర్పాటైన టీడీపీ ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి దళితులకు అవకాశం కల్పించారు. 
 
ఇపుడు తెలంగాణ రాష్ట్రం నుండి కేసీఆర్ ఒక్క దళితుడు, గిరిజనుడు, బీసీలకు అవకాశం కల్పించలేదు. ఈయన ప్రభుత్వంలో మాదిగలకు ఎలాగూ అవకాశం ఇవ్వలేదు. కనీసం తితిదేలో సభ్యుడుగానైనా నియమించ లేదు. మాదిగలపై కేసీఆర్ భయంకరంగా వివక్ష చూపుతున్నారు అని ఆయన ఆరోపించారు.