1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PY REDDY
Last Updated : ఆదివారం, 21 డిశెంబరు 2014 (17:05 IST)

రూపాయికో దెబ్బ.. వంద దెబ్బలు.. కార్మికునిపై యజమాని దాడి. ఎక్కడ? ఎప్పుడు?

అదో పవిత్ర పుణ్య క్షేత్రం అక్కడ. ఆ పుణ్య క్షేత్రంలో ఓ హోటల్ యజమాని  రాక్షసుడిలా వ్యవహరించాడు. వంద రూపాయలు చోరీ చేశారని కార్మికునిపై తెగబడ్డాడు. గొడ్డును బాదినట్లు బాదారు. స్టోర్ గది వేసి బంధించారు. ఈ సంఘటన జరిగింది సాక్షాత్తు తిరుమలేశుని చెంతన తిరుమలలోనే.. వివరాలిలా ఉన్నాయి. 

 
యజమాని కొట్టడంతో గాయపడిన బాలాజీ
తిరుమలలోని మ్యూజియం పక్కనే ఉన్న ఉడ్ సైడ్ హోటల్లో బాలాజీ అనే యువకుడు గత నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి వంద రూపాయలు దొంగతనం చేశాడని అతనిని రాత్రంతా బంధించారు. స్టోర్ రూంలో నన్ను తీసుకెళ్ళి పెట్టారు. విషయం తెలుసుకున్న యజమాని కృష్ణభట్ ఆగ్రహంతో ఊగిపోయాడు. బెల్టుతో  కార్మికునిపై దాడి చేశాడు. అతను కొట్టి దెబ్బలకు శరీరం అంత తీవ్రగాయాలైయ్యాయి. 
 
ఈ సంఘటన తిరుమలలో భక్తులను సైతం కలచి వేసింది. హోటల్ నాలుగు సంవత్సరాలుగా పని చేస్తున్నానని, తమ వద్ద ఎక్కువ సమయం పని చేయించుకుని తక్కువ జీతాలు ఇస్తున్నారని బాలాజీ ఆరోపిస్తున్నారు. ఉడ్ సైడ్ హోటల్లో టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా ఇతర మతస్తులను పెట్టుకుని పనిచేయిస్తున్నాడని వర్కర్ బాలాజీ ఆరోపిస్తున్నాడు. 
 
ఫిర్యాదు చేయడంతో పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అతనిని తాను కొట్టలేదని ఎవరు కొట్టారో తనకు తెలియదని హోటల్ యజమాని చెపుతున్నారు. అతనసలు తమ హోటల్ లోనే పని చేయలేదని చెపుతున్నాడు. అయితే సిసి కెమెరా ఫుటేజీ చూపాలని కోరుతుంటే కెమెరాలు రిపేరులో ఉన్నాయని బుకాయిస్తున్నాడు.