సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (11:21 IST)

సుజనా చౌదరిపై ఐటీ దాడులు.. అంతా మోదీ మాయే- చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరిపై ఈడీ, ఐటీ దాడులపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. సుజనాపై ఈడీ, ఐటీ దాడులు బీజేపీ రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్టని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణకు జరిగే ఎన్నికల్లో ప్రజా కూటమి గెలుపు చారిత్రక అవసరమని చెప్పారు. 
 
విడిపోయిన వేళ ధనిక రాష్ట్రంగా వున్న తెలంగాణ, ప్రస్తుతం అప్పుల్లో కూరుకుపోయేందుకు కేసీఆర్ విధానాలే కారణమని చంద్రబాబు విమర్శించారు. ఐదువేల రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపాలని పిలుపునిచ్చారు. 
 
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన నందమూరి సుహాసినికి మద్దతుగా తారకరత్న రంగంలోకి దిగారు. తన సోదరిని గెలిపించాలని కోరుతూ.. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేశారు. 
 
ఈ ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధిస్తేనే రాష్ట్ర ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు. సుహాసిని గెలిస్తే, ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు.