సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జూన్ 2022 (19:04 IST)

పాఠశాలలకు తాళాలు వేస్తున్న తల్లిదండ్రులు..

schools closed
విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ తగినంత బోధనా సిబ్బంది లేక విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళాలు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. దమ్మపేట మండలం, మల్లారంలో ఈ సీన్ చోటుచేసుకుంది. ఈ పాఠశాలకు పేరెంట్స్ తాళాలు వేశారు. 
 
మల్లారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండగా ఒక టీచర్ ఆరు సంవత్సరాల క్రితం డిప్యుటేషన్‌పై వెళ్లిపోయారు. సదరు టీచర్ హైదరాబాద్‌లో ఉంటూ మల్లారం గ్రామంలోని పాఠశాలలో టీచర్‌గా జీతం పొందుతుండడం గమనార్హం.
 
ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టినప్పటి నుంచి తమ పిల్లల భవిష్యత్తు మారుతుందని ఎంతో ఆశ పడ్డామని కానీ టీచర్ల కొరతతో అసలుకే మోసం వస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. 
 
విద్యార్థులు లేక పాఠశాలలు మూతబడుతున్న తరుణంలో ప్రభుత్వ పాఠశాలలకు భారీగా విద్యార్థులు వస్తున్నా.. విద్యాశాఖ అధికారుల అలసత్వం వల్ల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.