మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

'కష్టంలో ఉన్నానని ఎవరొచ్చినా చేయగలిగినంత సాయం చేసే మెగా హీరో' ఎవరు?

టాలీవుడ్ చిత్రపరిశ్రమను మెగా హీరోలు ఏలేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అనే వటవృక్షం పుట్టిన శాఖలే వీరంతా. వీరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది మాత్రం విభిన్నశైలి. ఎందుకంటే.. నిజాయితీపరుడు, ముక్కుసూటి మన

టాలీవుడ్ చిత్రపరిశ్రమను మెగా హీరోలు ఏలేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అనే వటవృక్షం పుట్టిన శాఖలే వీరంతా. వీరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది మాత్రం విభిన్నశైలి. ఎందుకంటే.. నిజాయితీపరుడు, ముక్కుసూటి మనిషి, మంచి వ్యకిత్వం వంటి లక్షణాలను ఆయన సొంతం. ఇవే ఆయనకు ఎక్కడలేని పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. 
 
వీటన్నింటికంటే.. ప్రధానంగా 'కష్టంలో ఉన్నానని ఎవరొచ్చినా ఆయన చేయగలిగినంత సాయం చేస్తుంటారు. అంతేకాక ఆ విషయాన్ని బయటకి రానివ్వకపోవడం ఆయనలో ఉన్న మరో గొప్ప గుణం' ఆయన సొంతం. ఫలితంగా మరో జీవితానికి పునాది పడింది. ఈ నేపథ్యంలో తాజా ఓ వ్యక్తికి తన చేతనైన సాయం చేశాడు. ఈ చేసిన సాయాన్ని మాత్రం బయటకు పొక్కనివ్వలేదు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గత కొనేళ్లుగా పవన్ కల్యాణ్‌కు పర్సనల్‌ హెయిర్‌ స్టైలిస్ట్‌గా రామ్‌ అనే వ్యక్తి పని చేస్తున్నారు. ఆయన సొంతంగా సలూన్ పెట్టుకునేందుకు పవన్ సాయం చేశాడు. ఇదే విషయాన్ని రామ్ వెల్లడించేంత వరకు ఎవరికీ తెలియదు. దీనిపై రామ్ మాట్లాడుతూ... నా ‘సెలూన్ కొనికి’ కూడా ఆయన సహాయంతోనే ప్రారంభమవుతోంది’ అని తెలిపారు. 
 
జూబ్లీ హిల్స్‌లో ‘సెలూన్ కొనికి’ను పవన్ కల్యాణ్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం రామ్‌కి శుభాకాంక్షలు తెలిపారు పవన్. పవన్ కల్యాణ్‌కి కొన్నేళ్లుగా హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేస్తున్నానని ఆయన సహాయంతోనే ఇపుడు సెలూన్‌ను ప్రారంభించినట్టు తెలిపారు.