శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 23 అక్టోబరు 2018 (13:56 IST)

సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవనున్న పవన్ కళ్యాణ్

తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బాధితులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి, పునరావాస కార్యక్రమాలు, బాధితులకు అందుతున్న సహాయక చర్యలు తదితర అంశాలను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్.. ఇదే అంశంపై ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు.
తుపాన్ బాధితులను ఆదుకోవడంతో ఎపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వీలైనంత త్వరగా బాధితులను ఆదుకోవాలని గవర్నర్‌ను కోరనున్నట్టు సమాచారం. మరోవైపు తమకు సహాయం అందడంలేదంటూ కొన్ని ప్రాంతాల్లో బాధితులు ఆందోళనకు దిగుతున్న పరిస్థితుల్లో వీటి అన్నింటిపై గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు పవన్ కల్యాణ్.