సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శనివారం, 20 అక్టోబరు 2018 (14:05 IST)

పవన్ ఇక్కడ నిలబడితే చిత్తుచిత్తే.... రాములమ్మ వ్యాఖ్యలు...

జనసేనానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. తెలంగాణా రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేస్తే చిత్తుగా ఓడిస్తామని, కాంగ్రెస్ పార్టీ దెబ్బకు ఏ పార్టీ నిలబడే అవకాశమే లేదన్నారు. టిఆర్ఎస్ ఈసారి అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదని, కెసిఆర్ పైన ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పవన్ కళ్యాణ్‌ ఇప్పటివరకు తెలంగాణాలో పోటీ చేస్తానని ప్రకటన చేయలేదని, ప్రకటన చేసినా కూడా తామేమీ భయపడేది లేదన్నారు. ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
 
కాంగ్రెస్ అంటే తెలంగాణా రాష్ట్ర ప్రజల్లో నమ్మకం ఏర్పడిందని, ఆ నమ్మకమే వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందంటున్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణా రాష్ట్రంలో జెండాను ఎగురవేసి సత్తా చాటుతామన్నారు విజయశాంతి.