బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : శనివారం, 20 అక్టోబరు 2018 (13:36 IST)

సెటిల్‌మెంట్లలో రూ.11కోట్ల నల్లధనం వచ్చిందని రేవంత్ బావమరిది చెప్పారు..

ల్యాండ్ సెటిల్‌మెంట్లు, కబ్జాలతో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు సంపాదించారని ఐటి రిపోర్ట్‌లో ఉందని, సెటిల్‌మెంట్లతో రూ.11 కోట్లు నల్లధనం వచ్చిందని రేవంత్ బావమరిది చెప్పారని జివిఎల్ నరసింహా రావు చెప్పారు. రేవంత్ మామ వద్ద రూ.11 లక్షలు, బావమరిది వద్ద 1.2 కిలోల గోల్డ్‌ను ఐటి అధికారులు సీజ్ చేశారని, కెఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి వద్ద రూ.1.40 కోట్ల్లు ఐటికి దొరికాయని వివరించారు 
 
కూలీలకు డబ్బులు ఇచ్చామని అనేక రెట్లు పెంచి చూపించారని, రేవంత్ రెడ్డి బావమరిది సబ్ కాంట్రాక్టులు చేశారని ఐటి రిపోర్ట్‌లో ఉందని తెలిపారు. కెఎల్‌ఎస్‌ఆర్ ఇన్ఫ్రాటెక్ రూ.20 కోట్ల బోగస్ కాంట్రాక్టులు చూపుతుందని, సీజ్ చేసిన డిజిటల్ డేటాను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై ఐటి సోదాల రిపోర్ట్ బయటకు వచ్చిందని జివిఎల్ నరసింహా రావు తెలిపారు. కెఎల్‌ఆర్ ఇన్‌ఫ్రాటెక్ సంస్థ బినామీ అని తెలుస్తోందని, రేవంత్ సోదరుడు కంపెనీ భూపాల్ ఇన్ఫ్రాటెక్ అనేక సబ్‌కాంట్రాక్ట్ పనులు చేసిందని, కెఎల్‌ఆర్ సంస్థ నుంచి సబ్‌కాంట్రాక్ట్ తీసుకున్నారని, భూలావాదేవీలతో రేవంత్ నల్లధనాన్ని సంపాదించి అక్రమాలకు పాల్పడ్డాడని జివిఎల్ ఆరోపణలు చేశారు.