శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 అక్టోబరు 2018 (14:16 IST)

కేసీఆర్ ఉడుత ఊపులకు చంద్రబాబు భయపడడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ వర్కింట్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఉడుత ఊపులకు భయపడే మనిషి చంద్రబాబు కాదని, ఓటుకు నోటు కేసులో కేసీఆర్ నన్నే ఏం పీకలేదు.. ఇక చంద్రబాబుని పీకుతడా..? అని మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారు. సీట్లు అడుక్కోవటం కేసీఆర్‌కి అలవాటైన పని.
 
నాడు వై.ఎస్, చంద్రబాబు దగ్గర సీట్లు అడుక్కున్న సంగతి కేసీర్ మర్చిపోయావా అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుర్చీ చంద్రబాబు లాక్కుంటున్నట్టు భయపడుతున్నారని తెలంగాణలో చంద్రబాబు, లోకేష్‌లు ఓటు హక్కు కూడా లేదన్న సంగతి గమనించాలన్నారు. ఓటు హక్కు కూడా లేని వాళ్ళ గురించి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడని అన్నారు.
 
చంద్రబాబుకి తెలంగాణకు సంబంధం లేదు. కానీ తెలంగాణకి తెలుగుదేశానికి మాత్రమే సంబంధం ఉంది. తెలంగాణలో లబ్ది పొందేందుకు తెలుగుదేశం.. టీఆర్ఎస్ మధ్యే పోటీ అనేలా కేసీఆర్ చిత్రీకరణ చేస్తున్నాడని కేసీఆర్ బండారాన్ని త్వరలోనే  బయటపెడతాం అన్నారు. టీఆర్ఎస్ ఆరుగురు ఎమ్మెల్యేలు, 20 మంది కార్పొరేటర్లు ఆంధ్ర నుండి వచ్చిన వాళ్లే కదా అంటూ కేసీఆర్ పైన తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ రెడ్డి.