Daily Horoscope
✕

ఫ్యామిలీ సభ్యులను ఆహ్వానించను.. చెర్రీ వ్యాఖ్యలపై పవన్

జనసేన పార్టీలోకి కుటుంబ సభ్యులను ఆహ్వానించబోనని ఆ పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. అయితే ఎవరైనా స్వతహాగా పార్టీలోకి వస్తానంటే మాత్రం ఆహ్వానిస్తానని చెప్పారు.

Written By pnr
Updated: బుధవారం, 30 మే 2018 (08:50 IST)
జనసేన పార్టీలోకి కుటుంబ సభ్యులను ఆహ్వానించబోనని ఆ పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. అయితే ఎవరైనా స్వతహాగా పార్టీలోకి వస్తానంటే మాత్రం ఆహ్వానిస్తానని చెప్పారు.
 
తన బాబాయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలిస్తే ఆ పార్టీ తరపున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సినీనటుడు రామ్ చరణ్ తేజ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పవన్ తాజాగా స్పందించారు. 
 
ఎవరైనా స్వతహాగా వస్తే తన పార్టీలోకి ఆహ్వానిస్తానని, అంతేగానీ తన కుటుంబ సభ్యులను రమ్మని అడగబోనని తేల్చిచెప్పారు. పైగా, రాజకీయాల్లోకి రావాలంటే చాలా నిబద్ధత ఉండాలని, ఇష్టపడి రావాలన్నారు. అందువల్ల రాజకీయాల్లోకి వచ్చేవారిని ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని రమ్మని అంటానని చెప్పారు. 
 
ఇకపోతే, తన కుటుంబ సభ్యులు సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని, వారికెందుకు ఇబ్బంది? అలాంటి వారిని తాను ఇబ్బంది పెట్టదలచుకోలేదనీ, అంతకు మించి దీనిపై ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదని పవన్ చెప్పుకొచ్చారు. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Naga Vamsi: జైలర్ 2 పబ్లిసిటీ వద్దనుకున్నాం - మీడియావాళ్ళు కర్నాటలో షోలు చూడండి : సూర్యదేవర నాగవంశీ

Keerthy Suresh: లతా రెడ్డి పాత్రను అభినందిస్తూ కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలిపిన అనిల్ రావిపూడి

తమిళ చలనచిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు దేవా కన్నుమూత

కచా బాదం పాటను డిస్ప్లే చేసారని కాన్పూర్ దాండియా ఈవెంట్ నుండి అంజలి అరోరా నిష్క్రమణ

Nag: ఇట్లు అర్జున సినిమాను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది : నాగార్జున

తర్వాతి కథనం
Show comments