శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (19:37 IST)

పవన్ చిడతల నాయుడు: మంత్రి పేర్ని నాని

చిడతల నాయుడ్ని నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్టేనని, జనాల్లోకి రావడం, ధర్నాలు చేయడం చిడతల నాయుడు(పవన్ కళ్యాణ్)కు వ్యాపారమని మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి నాని విరుచుకుపడ్డారు.
 
పేర్ని నాని మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..
 
1- ఇవాళ నివర్‌ తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పంటనష్టపరిహారంతో పాటు, మూడో విడత వైయస్సార్‌ రైతు భరోసా-పిఎం కిసాన్ నిధుల్ని జగన్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో  రూ.1,766 కోట్లు జమ చేయటం జరిగిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మూడో విడత రైతు భరోసా కింద 51.59 లక్షల మంది రైతులకు రూ.1,120 కోట్ల సాయం జమ చేయటం జరిగిందని పేర్ని నాని తెలిపారు.

నివార్‌ తుపాను వల్ల 12.01 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ.646 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగిందని పేర్ని నాని వివరించారు. ఇలా పంట నష్టం జరిగిన ఆ సీజన్‌లోనే నష్టపరిహారం ఇవ్వటం దేశంలో తొలిసారని పేర్ని నాని పేర్కొన్నారు. రంగు మారి మొలకెత్తిన 73 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేశాం. ఇంకా చేస్తాం.
 
2- నివర్‌ తుపాను వల్ల దెబ్బతిన్న 13.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయటం జరిగింది. రంగు మారి మొలకెత్తిన 73 వేల మెట్రిక్‌ టన్నులు ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ ప్రక్రియ ఇంకా  కొనసాగుతోందని పేర్ని నాని వివరించారు. 
 
3- రాష్ట్రవ్యాప్తంగా నివర్ తుపాను వల్ల పంట దెబ్బతిని విత్తనాలు కావాలని రైతు భరోసా కేంద్రాలకు వచ్చిన రైతులకు ఇప్పటివరకు 43వేల క్వింటాళ్ల విత్తనాలను 80% సబ్సిడీ మీద అందజేయటం జరిగింది. ఇంకా ఎంతమంది రైతులు విత్తనాలు కావాలని రిజిస్టర్‌ అవుతారో వారికి కూడా 80% సబ్సిడీ మీద వరి విత్తనాలు అందజేయటం జరుగుతుందని పేర్ని నాని తెలిపారు. 
 
4- గత ప్రభుత్వం సున్నా వడ్డీ బకాయిలు రూ.904 కోట్లను శ్రీ జగన్ గారి ప్రభుత్వమే తీర్చటం జరిగిందని పేర్ని నాని తెలిపారు. అలాగే వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం కింద ఈ ఖరీఫ్‌లో రూ.510 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. భారీ వర్షాలు, తుపానుల వల్ల నష్టపోయిన రైతాంగానికి సుమారుగా రూ.1,038 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్ని నాని తెలిపారు.

గత ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టిన బకాయిల్లో రూ.960 కోట్లు శ్రీ జగన్ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ఉచిత విద్యుత్‌ కోసం, ఆక్వారంగంలోని రైతులను ప్రోత్సహించటం కోసం రూ.17,430 కోట్లు వెచ్చించామని పేర్ని నాని వివరించారు. ఉచిత విద్యుత్ పగటిపూట మాత్రమే ఇవ్వాలనే లక్ష్యంతో ఫీడర్ల కోసం రూ.1700 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందని పేర్ని నాని తెలిపారు.

గత ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విత్తన బకాయిలు రూ.383 కోట్లు కూడా జగన్ ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో జమ చేయటం జరిగింది. మొత్తంగా జగన్ సీఎం అయినప్పటి నుంచి ఈ 18 నెలల కాలంలో రూ.61,400 కోట్లను రైతుల కోసమే జగన్ ప్రభుత్వం చిరునవ్వుతో ఖర్చు పెట్టడం జరిగింది. ఇది రైతు హిత ప్రభుత్వమని భారతదేశంలో ఇంతకన్నా మిన్నగా రైతులపై శ్రద్ధ చూపించే ప్రభుత్వాలు లేవని ఇలాంటి ప్రభుత్వం ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే.
 
5- దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే కౌలు రైతులకు, ఆర్వోఎఫ్‌ఆర్‌ రైతులకు, దేవుడు మాన్యం కౌలు చేసుకునే దళిత రైతులకు, అసైన్డ్‌మెంట్ ద్వారా పట్టాలు పొందిన రైతులకు రైతు భరోసా అందజేయటం జరుగుతోందని పేర్ని నాని పేర్కొన్నారు. 
 
6-ఓ సినిమా యాక్టర్‌ నాపై విమర్శలు చేశారా? ఏమన్నారు? మెడపై మట్టి నలుపుకుంటూ ఉంటాడు. ఆయనేనా పవన్ అంటే అని పేర్ని నాని ప్రశ్నించారు. ఆయన ఏమన్నారు నన్ను అని మీడియాను పేర్ని నాని అడిగారు. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించటం చిడతల నాయుడుకే సాధ్యం తప్ప భూమ్మీద ఇంకెవ్వరికీ సాధ్యం కాదన్నారు. నా గుండెల నిండా మహానేత వైయస్‌ఆర్‌ అంటే అభిమానం ఉంది. చచ్చేంత వరకు వైయస్‌ఆర్‌ తప్ప ఇంకొకరి పేరు మాట్లాడను.

వైయస్‌ఆర్‌ కుమారుడైన జగన్ ని కూడా అంతే అభిమానిస్తాను. నేను చనిపోయేంత వరకు చిడతలు వాయించినా, భజన చేసినా వైయస్‌ఆర్ కుటుంబానికే చేస్తాను. అది నా స్వామి భక్తి. చచ్చిపోతూ కూడా వైయస్‌ఆర్‌ కుటుంబానికి భక్తుడిగానే చనిపోవాలనుకుంటాను. 
 
7- మన చిడతల నాయుడుకు 2013-14లో హైదరాబాద్‌లో ఖరీదైన హైటెక్స్‌లో మీటింగ్ పెట్టి.. అమాయకులైన ఫ్యాన్స్‌ ను పిలిచి.. ఎవరికి చిడతలు కొట్టారని పేర్ని నాని ప్రశ్నించారు. ఆనాడు సోనియాగాంధీకి రివర్స్‌ చిడతలు కొట్టాడు. మోడీకి చిడతలు కొట్టారు. నెల తిరగకుండానే చంద్రబాబుకు చిడతలు కొట్టారు. ఆ చిడతలు కొట్టడం వల్ల లాభం పొందింది ఎవరు?

చిడతలతో క్యాష్ కొట్టే బ్యాచ్ మన చిడతల నాయుడుది. అది అయిపోయింది. 2014-17 దాకా చంద్రబాబుకు చిడతలు కొట్టావు. మోడీని మర్చిపోయావు. తర్వాత మోడీ అపాయింట్‌మెంట్ ఇవ్వడు అని మాట్లాడారు. ప్రశ్నించటానికి పార్టీ పెట్టాను అన్నావు. పార్టీ పెట్టింది గుర్తుంది కానీ ప్రశ్నించటం మర్చిపోయాడు. అది అయిపోయిన తర్వాత మళ్లీ 2017లో పేమెంట్ ఇవ్వట్లేదని చంద్రబాబుకు రివర్స్‌లో చిడతలు కొట్టాడు.

2019కు వచ్చేసరికి అనుకూలమైన చిడతలు కొట్టాడు. మోడీని పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడని తిట్టావు. 2019 ఎన్నికలు కాగానే  చిడతలు కొట్టుకుంటూ... మోడీ కాళ్ల దగ్గరకు చిడతల నాయుడు చేరాడు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల ముందు కమ్యూనిస్టులకు చిడతలు కొట్టావు. ఎన్నికలు అయిపోగానే ఎర్రచిడతలు పక్కన పడేసి.. కాషాయ చిడతలు పట్టుకున్నావు. ఇన్నివిధాలుగా చిడతలు కొట్టడం మీకు వ్యాపారం అయింది కానీ మాకు కాదని పేర్ని నాని మండిపడ్డారు. 
 
8- వైయస్‌ఆర్‌ అంటే నాకు పిచ్చని ప్రపంచానికి తెలుసు.. నా ఇంట్లో బెడ్రూం నుంచి హాల్ వరకు వైయస్‌ఆర్‌ ఫొటోలు ఉంటాయి. నా దేవుడు కుమారడైన జగన్ కి చిడతలు కొడితే తప్పేంటి? భజన చేస్తే తప్పేంటి? అది భక్తిపూర్వకంగా కొడతాను కానీ క్యాష్‌ కోసం కాదు కదా? క్యాష్‌ కోసం కొట్టేది చిడతల నాయుడు అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

రాజకీయ పార్టీ అని ఏం చేశాడు. చిడతలు కొట్టినా, అనుకూల చిడతల కొట్టినా ఏది కొట్టినా ఆయనకు క్యాషే అని పేర్ని నాని సెటైర్లు వేశారు. పులివెందుల్లో, వైజాగ్‌లో అసెంబ్లీ పెట్టుకున్నా అక్కడకు వచ్చేస్తానని అనటం ఏంటని అసలు అసెంబ్లీ అక్కడ పెడతామని ఎవరైనా ఆయనకు చెప్పారా అని పేర్ని నాని ప్రశ్నించారు. 
 
9- అరకులో వకీల్ సాబ్‌ సినిమా షూటింగ్‌లో భాగంగా ఆదివాసీలను కలుసుకున్నానని ఓ ట్వీట్, ఆ తర్వాత జనసేన పోరాట యాత్రలో భాగంగా ఆదివాసీలను కలుసుకున్నానని వారి జీవితాల్లో మార్పు తీసుకురావటానికి నిరంతం అండగా ఉంటామని మరో ట్వీట్‌ పవన్‌  కళ్యాణ్‌ చేశారని పేర్ని నాని చూపించారు. అరకు వాళ్లు పవన్‌ కళ్యాణ్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు అవుతుందని పేర్నినాని మండిపడ్డారు. సినిమా సెట్టింగులు వేసి.. డ్రామాలు ఆడుతున్నారు. 
 
10- 2014లో చంద్రబాబుకు ఓటేయమని చిడతల నాయుడు చెప్పారు. ఇది నా ప్రభుత్వం అని చెప్పి 2014-19 వరకు పంట నష్టపోతే ఆనాడు ఇచ్చింది ఎంత అని పేర్ని నాని ప్రశ్నించారు. తుపాన్లు వచ్చి పంట నష్టపోతే రైతులకు ఎంత ఇప్పించారు. అప్పుడు ఏ అసెంబ్లీలు ముట్టడించారని పేర్ని నాని ప్రశ్నించారు. అప్పుడు, చంద్రబాబు, చిడతల నాయుడు కలిసి రైతులకు ఇచ్చిన దానికన్నా 50% ఎక్కువే ఇస్తున్నామని పేర్ని నాని తెలిపారు. చంద్రబాబు,  చిడతల నాయుడు రైతులకు ఎగనామం పెట్టి వెళ్లిన ఇన్‌పుట్‌ సబ్సిడీలు (2016, 2017, 2018) శ్రీ జగన్ ప్రభుత్వమే కట్టిందని పేర్ని నాని గుర్తు చేశారు. 
 
11- సీఎం సాబ్‌కి చెప్పండి.. ఈ వకీల్ సాబ్  చెప్పారని అంటారా? అసలు ఈయన వకీల్‌ ఎప్పుడు అయ్యారండీ. ప్లీడర్ గా ఏ యూనివర్శిటీలో లా  చేశారు. పవన్‌ వకీల్ అన్నది ఎంత నిజమో, ఈయన రాజకీయం, రైతుల పట్ల తాపత్రయం అంతే నిజమని ప్రజలు ఎప్పుడో గుర్తించారు. ప్రజలు నా బ్రతుకు గుర్తించారన్న సంగతి చిడతల నాయుడుకు తెలియటం లేదని పేర్ని నాని అన్నారు. తెలిస్తే ఈ ప్రయాస ఉండదు కదా అని ఎద్దేవా చేశారు. 
 
12- హైదరాబాద్‌ నుంచి వచ్చి బెజవాడలో రాత్రి అంతా పడుకొని ప్రయాసపడి పాఠం చదువుకొని ఎవ్వరికీ భయపడను అనటం ఏంటి? అసలు గుడివాడలో కొడాలి నాని పేరు ఎందుకు ఎత్తలేకపోయారని పేర్నరి నాని ప్రశ్నించారు. నేను దొరుకుతాను కాబట్టి నాపేరు ఎత్తారు. మరి, గుడివాడలో కూడా అక్కడ ఎమ్మెల్యే ఎవరని అడగొచ్చు కదా అని పేర్ని నాని అన్నారు.

అక్కడ భయం. బందరు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరని అడుగుతావ్. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెడతావ్.. ఎక్కడ ఎవరు ఎమ్మెల్యేనో చిడతల నాయుడుకు తెలీదు. ఈ రాష్ట్రంలో ఎవరు మంత్రో చిడతల నాయుడుకు తెలీదు. నిన్ను రాజకీయనాయకుడ్ని అనుకోమంటావ్. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పెట్టినట్లైతే ఎవరు ఏ ఎమ్మెల్యేనో తెలియాలి కదా. 
 
13- క్రమపద్ధతిగా అడుగుతాం. బూతులు తిట్టం అంటారు. అస్సలు వైయస్‌ఆర్‌సీపీ వాళ్లు ఎవరైనా చిడతల నాయుడు జోలికి వచ్చారా? నిన్ను ఆటలో ఒక అరటిపండు అని మేం అసలు ఏమీ మాట్లాడలేదు. విశాఖపట్నంలో నోటికి వచ్చినట్లు, సభ్యత, సంప్రదాయం లేకుండా మహానేత వైయస్‌ఆర్‌ గురించి మాట్లాడింది మొదట పవన్ కళ్యాణ్ కాదా?

మీరు పరమపూజ్యుడు అన్నట్లు... ఏమి అన్నా.. ఎవ్వరూ ఏమీ అనకూడదు. నీ జోలికి ఎవ్వరూ రాకూడదు. భయపడిపోవాలి. నువ్వే కాదు.. నేను కూడా కాపునే. నీకు ఎలా భయంలేదో నాకు అలాగే భయం లేదు. ఎవరికి భయం.. ఎందుకు భయం. అసలు ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు మాట్లాడనని .. ఏం మాట్లాడినా పార్టీ వేదికగా మాట్లాడతానని పేర్ని నాని స్పష్టం చేశారు. 
 
14 - చంద్రబాబు ఇంటికి చిడతల నాయుడు వెళ్తే సూట్‌ కేసు ఇచ్చి పంపిస్తాడు. అదే మా ఇంటికి ఆయన వస్తే పచ్చడి అన్నం పెడతాను తప్ప అంతకుమించి నావల్ల ఏమి అవుతుందని  పేర్ని నాని ప్రశ్నించారు. ఇదా నీ సభ్యత, సంస్కారం అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దివంగత వైయస్‌.రాజశేఖరరెడ్డి గురించి ఇష్టానుసారం మాట్లాడే సంస్కృతిని మొదలు పెట్టింది పవన్ కళ్యాణ్ కాదా అని మండిపడ్డారు.
 
15- మూడు తుపానుల వల్ల దెబ్బతిన్న రైతులకు చిడతల నాయుడు అండగా నిలబడతాడు అంట. ఆరు సినిమాలకు కాల్షీట్లు ఇచ్చాడు. షూటింగ్ ఆగితే తప్ప ఈయన వెనక్కి రాడని, లేకపోతే షెడ్యూల్‌లో మిగతా సినిమాలు లేకపోతే బయటకు రావాల్సిందే తప్పితే ప్రజల్లోకి రాని వ్యక్తి చిడతల నాయుడు అని పేర్ని నాని మండిపడ్డారు.

పెనుమాక, బేతంపూడి, ఉండవల్లి రైతులు చిడతల నాయుడ్ని పవన్‌ కళ్యాణ్‌ను మొదట నమ్మారు. లబా..లబా వచ్చావు. గబాలున్న వాళ్ల చేతిలో గిన్నె లాక్కొని పెరుగన్నం తిని వెళ్లిపోయి చంద్రబాబు బాగా చేస్తున్నారని చెప్పావు. ఆ రైతుల నమ్మకాన్ని కృష్ణానదిలో పవన్‌ కళ్యాణ్‌ కలిపేశారని పేర్ని నాని మండిపడ్డారు. 
 
16- తుందుర్రు రైతులకు ప్రాణం ధారపోస్తానని అన్నారు. ఏమైపోయావ్‌. ఎన్నాళ్లైపోయింది. ఇలా ఎంతమందిని ముంచేశావు. ఒక్క చంద్రబాబు నాయుడు మినహా ఇంకొక్కరికి ఎప్పుడైనా అండగా నిలబడ్డావా చిడతల నాయుడూ.. అని పేర్ని నాని ప్రశ్నించారు. కనీసం మీ అన్నచిరంజీవికి అయినా అండగా నిలబడ్డావా?

చిరంజీవికి అవి చేతకాదు కాబట్టి నిన్ను అండగా ఉంచుకోలేకపోయారు. చిడతల నాయుడ్ని నమ్ముకొని రైతులు ఉండాలా?  నీకు రాసిచ్చే వాళ్లు ఉంటారు. డైలాగులు చెబుతావ్. మాకు రాసిచ్చేవారు ఉండరు.. చేతైతే... సీరియస్‌ పాలిటిక్స్‌ చేయ్‌. రోడ్డు మీదకు రావటం, ధర్నా చేయటం అనేది చిడతల నాయుడుకు బిజినెస్‌. సహస్ర కోటి నాయుడులలో ఓ బోడి నాయుడు.
 
17- పవన్‌ నాయుడు అస్సలు భయపడట. అసలు, వైయస్‌ఆర్‌సీపీ జెండా మోసే కార్యకర్త కూడా పవన్‌ను లెక్క చేయడు. సినిమా డైలాగులు, రాసిస్తే గబగబా చదువుకొని పొద్దున్నే కార్లలో చదువుకొని మాకు అప్పజెప్పటం ఏంటి? ఈ శోష మాకేంటి.. చస్తున్నాం అని నాని ఎద్దేవా చేశారు. రోడ్డు మీదకు రావటం ఈ చిడతల నాయుడుకు సరదా కాదు, నిజమే.

అదేమీ సరదా కాదు.. వ్యాపారం. ధర్నాకు వ్యాపారం.. మీటింగ్ పెడితే లాభం... బోలెడంత లాభం. సరదా అని ఎవరు అన్నారు. శతకోటి లింగాల్లో బోడి లింగాన్ని నేను. నిజమే.. ఇంతకీ తమరు ఎవరు? సహస్ర కోటి నాయుడులలో ఓ బోడి నాయుడువు. పవన్ నాయుడువి. నీకేనా తిట్టడం వచ్చు. మాకు రాదా? ఎవ్వడికీ భయపడను. భయపడు అంటూ మాట్లాడాతావు. 

- నకిలీ వకీల్‌సాబ్ కు మోడీ దగ్గర, అమిత్‌షా దగ్గర అపాయింట్‌మెంట్‌ ఉండదు. కనీసం నడ్డా సాబ్‌కు అయినా చెప్పు. మాకు మాటలు రావా? మీకంటే ఎవరైనా రాసివ్వాలి. మాకు మాటలు రావా. నకిలీ వకీల్ సాబ్.. 
 
18- రైతు మరణిస్తే రూ.7 లక్షలు ఇస్తారా అని నోటికి వచ్చినట్లు చిడతల నాయుడు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ జాయింట్‌గా కలిసి ఉన్నప్పుడు  జాయింట్ ప్రభుత్వమే ఉంది కదా. అప్పుడు రైతుకు ఎంత ఇచ్చారు. అప్పుడు ఏమైపోయింది ఈ నోరు. ఎవర్ని ప్రశ్నించావు.

చంద్రబాబును ఐదేళ్లలో ఎప్పుడైనా ప్రశ్నించావా? చంద్రబాబు ప్రభుత్వం మరణించిన రైతులకు కూడా పంగనామం పెట్టి వెళ్తే శ్రీ జగన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వటం జరిగింది. ఈ విషయం తెలుసుకుంటే కాస్త మంచిదని సుతిమెత్తగా పేర్ని నాని అన్నారు.
 
19- 2014లో చిడతలనాయుడు, చంద్రబాబు చౌదరి కలిసి 87 వేల కోట్లకు పైగా రైతు రుణాన్ని బేషరతుగా మాఫీ చేస్తామని ఓట్లు అడుక్కున్నారు. కనీసం రూ.12,000 కోట్లు కూడా కట్టలేదని ఆర్బీఐనే చెప్పిందని పేర్ని నాని అన్నారు. శ్రీ జగన్ ప్రభుత్వం తప్పులు దిద్దుకోవటానికి చిడతల నాయుడు టైం ఇస్తున్నారంట. అయ్యా చిడతల నాయుడు గారూ.. నీకు వినమ్రంగా, పద్ధతిగా చెబుతున్నాము. దయచేసి చిడతల వాయించటం ఆపేసి.. నిఖార్సైన రాజకీయం చేయటానికి టైం ఇస్తున్నాం. 

- సినిమాలు చేస్తున్నాడు... సినిమాలు చేస్తున్నాడని మాట్లాడుతున్నారు. జగన్ కి పేపర్‌ లేదా? సిమెంట్ ఫ్యాక్టరీ లేదా? మైన్లు లేవా? మూసేయండని అంటారు. అసలు చిడతల నాయుడ్ని సినిమాలు మానేయండి ఎవరు అడిగారు.. ఎవరు ఏడ్చారు. - సంవత్సరానికి రూ.100 కోట్ల సంపద వదులుకొని మీ సేవ కోసం వస్తున్నానని మీరు ఏడ్చారు.

మీ ఇంటి ముందు కూర్చొని జనాలు ఏమైనా ఏడ్చారా. మాకు సేవ చేయమని ఏమైనా ఏడ్చారా? మీకు మీరుగా స్వయంగా ప్రకటించారు. రూ.100 కోట్ల సంపాదనను వదులుకొని ప్రజాసేవకు వస్తున్నానని మీరే మాట్లాడారు. మరి, ఈలోపు ఏమైపోయాయ్. ఆ రూ.100 కోట్లు వదిలేసి వస్తే.. ఆ పిచ్చి జనం  నమ్మేసి ముఖ్యమంత్రిని చేస్తే వెయ్యి రెట్లో, లక్ష రెట్లో సంపాదించుకోవాలని అనుకున్నావా? ఏంటీ? మరి ఎందుకు వెంటనే వెళ్లిపోయావ్‌. మిమ్మల్ని వ్యాపారం చేయొద్దు, సినిమాలు చేయొద్దు అని వైయస్‌ఆర్‌సీపీ గానీ, ప్రజలు గానీ అడిగారా? మీకు మీరే చెప్పుకున్నారు కాబట్టి అడుగుతారు అందరూ. 
 
20. జగన్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఇది శాసనం. జగన్ రెడ్డీ సీఎం కాడు అని చిడతల నాయుడు అన్నారు. ఏంటీ ఈ సొల్లు మాటలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత సీఎం జగన్ రెడ్డి తమరు దిగ్విజయంగా పరిపాలన చేయండి. నేను సినిమాలు చేసుకుంటానని అన్నారు.  అసలు పవన్ కళ్యాణ్ ఊసు ఎవరు ఎత్తారు. నాలాంటి తుంటరోలు ఎవరో ఒకరు ఉంటారు. నువ్వు రాజకీయాలకు తూచ్ చెప్పి వెళ్లిపోయావా అని అడుగుతారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన మాటల్నే.. తిరిగి ఇలా అడుగుతుంటే బాగా గుచ్చుకుంటుంటే, బాగా ఇబ్బందిగా ఉందా అని పేర్ని నాని ప్రశ్నించారు.