గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:38 IST)

సాయుధ బలగాల పరేడ్ సాధనను పరిశీలించిన జిల్లా ఎస్పీ

అనంతపురం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో పంద్రాగస్టు రోజున నిర్వహించే పరేడ్ ను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశించారు.

పంద్రాగస్టు రోజున నిర్వహించే పరేడ్ కోసం పోలీసు సాయుధ బలగాలు స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో సాధన చేస్తున్నాయి. జిల్లా ఎస్పీ సాయుధ బలగాల పరేడ్ సాధనను ఈరోజు తనిఖీ చేశారు. ముందుగా సాయుధ బలగాల నుండీ గౌరవ వందనం స్వీకరించారు.

ఆ తర్వాత పరేడ్ పరిశీలన వాహనంపై వెళ్లి సాయుధ బలగాలను నిశితంగా పరిశీలించారు. పంద్రాగస్టు రోజున సమర్థవంతంగా పరేడ్ నిర్వహించేందుకు అవసరమైన మెళకువలు, సూచనలు చేశారు. జిల్లా ఎస్పీతో పాటు ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.