గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 10 జనవరి 2022 (20:52 IST)

ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే పేరిట వైర‌ల్! ఏపీలో టీడీపీదే ట్రెండ్ !!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం వ‌ర్గాలు ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే పేరిట ఓ స‌ర్వే ఫ‌లితాల‌ను వైర‌ల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే, తెలుగుదేశంకి 111 స్థానాలు వ‌స్తాయ‌ని, వైసీపీకి కేవ‌లం 52 అసెంబ్లీ మాత్ర‌మే వ‌స్తాయ‌ని పేర్కొంటున్నారు. ఈ స‌ర్వే గ‌త మూడు నెల‌ల్లో చేసిన‌దిగా చెపుతున్నారు. జిల్లాల వారీగా ఈ స‌ర్వే ఫ‌లితాలు. 
 
 
1. అనంతపురం - టిడిపి (10), వైస్సార్సీపీ (4), జనసేన (0)
2. కర్నూలు - టిడిపి (10), వైస్సార్సీపీ (4), జనసేన (0)
3. నెల్లూరు - టిడిపి (7), వైస్సార్సీపీ (2), జనసేన (1)
4. ప్రకాశం - టిడిపి (10), వైస్సార్సీపీ (2), జనసేన (0)
5. గుంటూరు - టిడిపి (10), వైస్సార్సీపీ (5), జనసేన (2)
6. కృష్ణా - టిడిపి (10), వైస్సార్సీపీ (4), జనసేన (2)
7. ప.గో. - టిడిపి (10), వైస్సార్సీపీ (3), జనసేన (2)
8. తూ.గో. - టిడిపి (13), వైస్సార్సీపీ (4), జనసేన (2)
9. విశాఖ - టిడిపి (10), వైస్సార్సీపీ (5), జనసేన (0)
10. విజయనగరం - టిడిపి (6), వైస్సార్సీపీ (3), జనసేన (0)
11. శ్రీకాకుళం - టిడిపి (7), వైస్సార్సీపీ (2), జనసేన (1)
12. కడప - టిడిపి (4), వైస్సార్సీపీ (5), జనసేన (1)
13. చిత్తూరు - టిడిపి (4), వైస్సార్సీపీ (10), జనసేన (0)
 
 
మొత్తంగా చూస్తే టిడిపి - 111, వైస్సార్సీపీ - 53, జనసేన - 11 సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొంటున్నారు. అయితే, ఇది పి.కె. స‌ర్వే ఫ‌లితాలు కాదని, తెలుగుదేశం వ‌ర్గాలు చేసిన న‌కిలీ సర్వే ఫలితాల‌ని వైసీపీ వ‌ర్గాలు కొట్టిపారేస్తున్నాయి.