బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: మంగళవారం, 13 జులై 2021 (11:41 IST)

కొత్త రాజ‌ధాని విశాఖ‌కు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం

విశాఖ ఏపీ కొత్త రాజ‌ధానిగా మారుతోంద‌నే స‌మీక‌ర‌ణంతో ఇక్క‌డి వారికి నామినేటెడ్ పదవుల్లో తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. అందుకే ముంద‌స్తుగా ఇక్క‌డి 11 మందికి చైర్మన్ పదవులు, మరికొంత మందికి డైరెక్టర్ పదవులు.. ప్ర‌క‌టించ‌బోతున్నార‌ట‌. దీనికి సంబంధించి మధ్యాహ్నం జీవోలు జారీకి సన్నాహాలు జ‌రుగుతున్నాయి. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం...
 
విఎంఆర్ డీఏ చైర్మన్ గా అక్కరమాని విజయనిర్మల (విశాఖ తూర్పు నియోజకవర్గం).
 
రాష్ట్ర విద్యా విభాగం వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ (విశాఖ పశ్చిమ).
 
నెడ్ క్యాప్ చైర్మన్‌గా కేకే రాజు (విశాఖ ఉత్తరం).
 
రాష్ట్రమైనారిటీ విభాగం ఛైర్మన్‌గా జాన్ వెస్లీ (విశాఖ దక్షిణం).
 
రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ ఛైర్మన్ గా దాడి రత్నాకర్ (అనకాపల్లి).
 
విశాఖ రీజియన్ పెట్రో కారిడార్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్‌ (విశాఖ ఉత్తరం).
 
స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా  ప్రముఖ ఆడిటర్ జీవి.
 
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా చింతకాయల సన్యాసిపాత్రుడు (నర్సీపట్నం).
 
డీసీఎమ్ ఛైర్ పర్సన్ గా పల్లా చినతల్లి (గాజువాక).
 
రాష్ట్ర బ్రాహ్మణ విభాగం చైర్మన్‌గా సుధాకర్‌.
 
డీసీసీబీ ఛైర్మన్‌గా సుకుమార్ వర్మ (యలమంచిలి) కొన‌సాగింపు.