శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (20:14 IST)

ఏపీ సీఎం జగన్ సతీమణి భారతితో భేటీ అయిన ప్రిన్స్ మహేష్ సతీమణి నమ్రత, ఎందుకు?

గ్రామం ఫౌండేషన్ ద్వారా సినీ నటుడు మహేష్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎపిలోని బుర్రెపాళెం, తెలంగాణా రాష్ట్రంలోని సిద్ధాపూర్ గ్రామాలను మహేష్ బాబు దత్తత తీసుకున్నారు. తన సొంత నిధులతో ఈ గ్రామాలను మహేష్ బాబు అభివృద్ధి చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో మహేష్ బాబు సతీమణి నమ్రత.. ఎపి సిఎం సతీమణి భారతిని కలిశారు. తాడేపల్లిగూడెంలోని జగన్ నివాసంలో భారతిని నమ్రత కలిశారు. గ్రామం ఫౌండేషన్ ద్వారా మహేష్ బాబు చేస్తున్న అభివృద్ధిని భారతికి వివరించారు. 
 
మేము చేస్తున్న పనికి ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరారు నమ్రత. దీనికి సీఎం జగన్ సతీమణి భారతి కూడా పూర్తి సహకారం అందించడానికి సిద్ధమని చెప్పారట.