మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 16 అక్టోబరు 2019 (21:44 IST)

భార్య చక్కని చుక్క అయినా పరస్త్రీ మోజు, ఆ దోషం వున్నందువల్ల అలా జరుగుతుందట...

మన శాస్త్రాలు ఎన్నో నమ్మకాలను, విశ్వాసాలను మనకు కల్పించాయి. ఈ శాస్త్రాల్లో వాస్తు శాస్త్రం కూడా ఒకటి. వాస్తు శాస్త్రం ప్రకారం గృహం లేకపోతే ఇంట్లో పలు రకాల ఇబ్బందులు తలెత్తుతాయన్నది విశ్వాసం. గృహము బయట ఆగ్నేయ భాగములో పల్లమున్నచో, గుంతలు, బావులు, కొలనులు ఉన్నచో అశుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి గృహము వారికి ఈశాన్యము బాగుంటే ఇతరులను మోసం చేయడం, పరాయి స్త్రీలపై మోజు అధికంగా ఉండటం వంటి ఫలితాలుంటాయి. 
 
ఈశాన్యము సరిగా లేకపోతే మోసగించబడటం, చివరికి ఆడవారి చేతిలో కూడా మోసపోవడం, పరాయి స్త్రీలపై విపరీతమైన కామవాంఛలు, వారిని అనుభవించాలనే ఆలోచనలు అధికం కావడం, వాటికై ప్రయత్నాలు, ఒక్కొక్కసారి ఇతరులకు దొరికిపోవడం వంటి దుష్ఫలితాలుంటాయి. 
 
భార్య చక్కని చుక్క అయినప్పటీ ఇతరులపై మోజు తగ్గకపోవడం, అప్పడప్పుడు మద్య సేవనము, మాంసాహారం భుజించడం, విపరీతమైన కోపాన్ని కలిగి ఉండటం, కొన్ని సమయాల్లో భార్యను చితకబాదటం వంటివి చేస్తారు. 
 
కొన్ని పరిస్థితుల్లో అగ్ని ప్రమాదాలు, ఆక్సిడెంట్లు, కాళ్ళు చేతులు విరగడం, విపరీతమైన ఆకలి, బాగా లావు కావడం వంటి అశుభఫలితాలు కలుగుతాయి. గృహము బయట ఆగ్నేయ భాగము నందు గుట్టలుండటం, కొండలుంటడం, బహుళ అంతస్థులు ఉండినట్లైతే దరిద్రము, ధన నష్టము కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.