సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Updated : బుధవారం, 26 అక్టోబరు 2016 (17:08 IST)

పిల్ల‌ల‌తో ఎంతసేపు చూస్తావే... గుడిలోంచి బ‌య‌ట‌కు రా... సెక్యూరిటీ బ‌లుపు... ప్రభుత్వం చూస్తోందా...?

విజ‌య‌వాడ‌: ఇంద్రకీలాద్రిపై బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో ప్ర‌ైవేటు సెక్యూరిటీ సిబ్బంది దురుసుతనం పెరిగిపోయింది. అమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే వారిపట్ల వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీ

విజ‌య‌వాడ‌: ఇంద్రకీలాద్రిపై బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో ప్ర‌ైవేటు సెక్యూరిటీ సిబ్బంది దురుసుతనం పెరిగిపోయింది. అమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే వారిపట్ల వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. అంతరాలయం నుంచి మొదలై ఎక్కడపడితే అక్కడ ప్రైవేటు సెక్యూరిటీ తప్ప దేవస్థానం ఉద్యోగులు కనిపించడం లేదు. రాష్ట్రంలోని ఏ ప్రధాన ఆలయంలో లేని విధంగా ఇక్కడ అంతరాలయంలో కూడా ప్రైవేటు సిబ్బందే పెత్తనం చెలాయిస్తున్నారు. 
 
విధుల్లో ఉండాల్సిన ఉద్యోగులు పత్తా ఉండటం లేదు. గాజులతో అలంకరించిన దుర్గమ్మను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మంగ‌ళ‌వారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో భవానీపురానికి చెందిన నరసింహా రావు భార్యాపిల్లలతో కలిసి దర్శనానికి వచ్చారు. అమ్మవారి  దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా వారి ఇద్దరు చిన్న పిల్లలు మెల్లగా రావడం వల్ల అంతరాలయం బయట గేటు దగ్గర ఉన్న ప్రైవేటు సెక్యూరిటీ పెద్దగా అరుస్తూ... నీకు బుద్ధి ఉందా? పిల్లలతో ఎంతసేపు చూస్తావే... త్వరగా బ‌య‌ట‌కు తీసుకురావే... అంటూ కేకలేశాడు. 
 
వెంటనే నరసింహారావు అతని భార్య ఏమిటి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. భక్తులతో మాట్లాడే తీరు ఇదేనా అని  ప్రశ్నించేసరికి... అక్కడే విధుల్లో వున్న టెంపుల్ ఇన్స్పెక్టర్ వచ్చి భక్తులకే సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు తప్ప కనీసం ఇలా మాట్లాడకూడదు అని సెక్యూరిటీకి చెప్పలేదు. నలుగురిలో అవమానించడం పద్ధతి కాదంటూ భార్యాభర్తలు ఆవేదనతో వెళ్లారు. ఇక్కడ గుడిలో అన్ని కీలక స్థానాల్లో ప్రైవేటు సిబ్బంది పెత్తనమే కనిపిస్తోంది. గతంలో ఇక్కడ వీరు గేటు బయట విధుల్లో ఉండేవారు. కానీ కొంతకాలంగా ప్రైవేటు సిబ్బంది పెత్తనం గేటు దాటి గుడిలోకి కూడా వచ్చేసింది. మరి ఏపీ ప్రభుత్వం ఈ తతంగాన్ని చూస్తుందో లేదో...?