అమరావతి కోసం 23న అంబేద్కర్, న్యాయదేవతల విగ్రహాల వద్ద నిరసన
రాజధానిగా అమరావతి ఉండాలని కోరుతూ జరుగుతున్న ఉద్యమం 250 రోజులు పూర్తవుతున్న సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాలు, న్యాయ దేవత విగ్రహాలకు వినతిపత్రం ఇవ్వడంతో పాటు నిరసన కార్యక్రమాలను నిర్వహించనుననట్లు పరిరక్షణ సమితి జెఎసి కన్వీనర్ ఎ.శివారెడ్డి తెలిపారు.
ఆటోనగర్ లోని అమరావతి పరిరక్షణ సమితి జెఎసి ర్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము పిలుపునిచ్చిన ఈ నిరసన కార్యక్రమానికి అన్ని విధాల చక్కటి మద్దతు వస్తుందని ముఖ్యంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నాయని తెలిపారు.
అలాగే ప్రతి ప్రాంతంలో ప్రతి ఒక్కరూ 23వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంట వరకు ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రాజధాని పట్ల రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు.
సిఆర్‌డిఎ రద్దు, మూడు రాజధానుల బిల్లుల రద్దుపై రైతులు న్యాయ పోరాటం చేస్తున్నారని, దీని పైన ప్రతిపక్షాలు ఎందుకు న్యాయపోరాటం చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు కేవలం పత్రికా ప్రకటనలకే కాకుండా ప్రత్యక్ష పోరాటంలో రైతులు, అమరావతి జెఎసితో కలిసి రావాలన్నారు. శాంతియుతంగా అమరావతి కోసం తాము చేస్తున్న పోరాటాన్ని ప్రభుత్వం చులకనగా చూస్తుందని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ అమరావతిని రాజధానిగా ఉంచాలని కోరుకుంటుంటూ ఉన్నపటికి ముఖ్యమంత్రి మాత్రం ఏకపక్షంగా మూడు రాజధానుల ఉంచాలని కో అమరావతిని తరలించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము చేయబోయే కార్యక్రమాల్లో ప్రతిపక్షాలతో పాటు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పేర్కొన్నారు.
రానున్న కాలంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని చెప్పారు. చివరి రైతు వరకు న్యాయం జరగాలని పలు పార్టీలు ప్రకటనలు ఇస్తున్నాయని, అమరావతి రాజధానిగా ఉంటేనే చివరి రైతు వరకు న్యాయం జరుగుతుందని ఈ విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించి ప్రత్యక్ష ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు.
జెఎసి కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ ఈ రోజు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపడతాందని, ఈ రోజు వరకు మే మొదటి వారంలో రైతులకు ఇవ్వవలసని కౌలు డబ్బులు మూడు నెలలు గడిచినా ఇంత వరకు చెల్లించక పోవడం కక్ష సాధింపు చర్యకాదా అన్నారు.
అలానే రాజ్యాంగ వ్యతిరేఖంగా తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం ఏదైతో పతం ఉందో దానిని నెగ్గించుకోవడానికి న్యాయస్థానాల్లో వాదించడానికి విదేశాల నుండి న్యాయవాదులను తీసుకువచ్చి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి ప్రజా వ్యతిరేఖ కార్యకలాపాలు ప్రభుత్వం చేస్తున్నప్పటికి ప్రతిపక్ష పార్టీలు నోరుమెదపక పోవడంతో రాష్ట్ర ప్రజలు విశ్మయం చేందుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున జగరబోయే 250వ నిరసన కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వారివారి జెండాలతో ప్రభుత్వానికి నిరసన తెలపాలని అమరావతి పరిరక్షన సమితి, రాజధాని రైతు సమాఖ్య కార్యచరణ కోరుతుంది.
ఈ సమావేశంలో అమరావతి పరిరక్షణ సమితి జెఎసి కో కన్వీనర్ ఆర్.వి.స్వామి, గుంటూరు జిల్లా జెఏసీ నాయకులు మల్లిఖార్జునరావు పలువురు జెఎసి ప్రతినిధులు పాల్గొన్నారు.