శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (10:45 IST)

ఆల్ ఇండియా ఎంట్రన్స్ ర్యాంక్ తో భువనేశ్వర్లో బిటెక్ సీటు సాధించిన సందీప్

రంగ‌న్న‌గూడెం పాలిటెక్నిక్ విద్యార్థి అస‌మాన ప్ర‌తిభ‌ను క‌న‌ప‌రిచాడు. అఖిల భారత స్థాయి బి.టెక్., మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్ బి.టెక్., (ఎం.ఇ.టి.) 2వ సంవత్సరం ల్యాటరనల్ ఎంట్రీ కోసం పాలిటెక్నిక్ డి.పి.ఎం.టి. విద్యార్థులకు జరిగిన జె.ఇ.ఇ. 2021 లో 28వ ర్యాంకు సాధించాడు సందీప్. ఆ ర్యాంకుతో CIPET-IPT భువనేశ్వర్ లో బి.టెక్. సీటు కూడా సాధించాడు. ప్రాథమిక  స్థాయి నుంచి మెరిట్ విద్యార్థి అయిన కనకవల్లి సందీప్ 10వ తరగతిలో 8.5 గ్రేడ్ పొందాడు.  2018 లో రాష్ట్ర స్థాయిలో జరిగిన CIPET లో ఉత్తమ ర్యాంకు సాధించి విజయవాడ సూరంపల్లి క్యాంపస్ లో 2018-21 డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మోల్డ్ టెక్నాలజీ (DPMT) పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా జరిగే JEE-21 లో 28 వ ర్యాంకు సాధించి దక్షిణ భారతదేశంలోని కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల‌కు అందుబాటులో వున్న CIPET-IPT భువనేశ్వర్లో సీటు సాధించడం విశేషం.
 
ఇంత ప్రతిష్టాత్మకమైన బి.టెక్ సీటు సాధించిన కనకవల్లి సందీపును గ్రామ ప్రముఖులు సాగునీటి వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎం.పి.టి.సి. పుసులూరు లక్ష్మీనారాయణ, ఆర్.పి.డి.ఎస్. అధ్యక్షులు తుమ్మల దశరథరామయ్య, ఎం.పి.సి.ఎస్. అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు తదితరులు అభినందించారు. జాతీయస్థాయిలో రంగన్నగూడెం గ్రామానికి గుర్తింపు తెచ్చిన కనకవల్లి సందీపు రంగన్నగూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ తరపున కావలసిన సహాయ కార్యక్రమాలు అందిస్తామని ఆల్లవెంకట గోపాలకృష్ణారావు తెలిపారు.