ఏపీలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలకు అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాలలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొమరిన్ నుంచి మిళనాడు, దక్షణాంద్ర తీరాల మీదుగా నైరుతి, పశ్చిమ బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉన్నది. ఈ ప్రభావం వలన ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
ఈ భారీ వర్షాలు ప్రభావంతో అక్కడక్కడ వాగులు పొంగి ర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. సోమవారం నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసాయి. దీంతో అక్కడి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల రాగల రెండు రోజులకు కోస్తా, రాయలసీమ ప్రాంతాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది