గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: సోమవారం, 16 నవంబరు 2020 (19:38 IST)

ఏపీలో భారీగా కరోనావైరస్ తగ్గుముఖం, కొత్తగా 753 పాజిటివ్ కేసులు

ఏపీలో గత కొద్ది రోజులుగా కరోనా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 43,044 టెస్టులు నిర్వహించగా అందులో 753 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,54,764కి చేరింది. అయితే ఇందులో 17,892 యాక్టివ్ కేసులుండగా 8,54,764 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.
 
గడిచిన 24 గంటల్లో 1,507 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో కొత్తగా 13 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 6881కి చేరుకుంది. కోవిడ్ కారణంగా చిత్తూరు, కృష్ణ, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకొక్కరు చొప్పున మరణించారు.
 
అటు జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలించగా అనంతపురం 4, చిత్తూరు 87, తూర్పు గోదావరి 130, గుంటూరు 50, కడప 66, కృష్ణా 76 ,కర్నూలు 12, నెల్లూరు 14, ప్రకాశం 36, శ్రీకాకుళం 25, విశాఖపట్నం 25, విజయనగరం 12, పశ్చిమ గోదావరి 216 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు ఏపీలో 91,97,307 కరోనా టెస్టులు నిర్వహించారు.