ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 డిశెంబరు 2022 (08:57 IST)

5న అల్పపీడనం... 8 నుంచి కోస్తాలో వర్షాలు

rain
దక్షిణ అండమాన్, అగ్నేయ బంగాళాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఈ కారణంగా ఈ నెల 8వ తేదీ కోస్తాతీరంలో వర్షాలు కురవనున్నాయి. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణం చేసిన ఈ నెల 7వ తేదీ నాటికి వాయుగుండంగా మారుతుందని, ఇది తమిళనాడు, పుదుచ్చేరి తీరం దిశగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం కారణంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఈ నెల 8, 9 తేదీల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 
 
ప్రస్తుతం తూర్పు గాలుల ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందనిత ఐఎండీ అధికారులు తెలిపారు. నిజానికి గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు జోరుగా వరికోతలు కోస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం కురిస్తే మాత్రం పంట వర్షార్పణమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వర్షాలపై ఈ నెల 5వ తేదీ తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.