గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (11:55 IST)

రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఏపీలో రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ-కేవైసీ నమోదు కారణంగా తలెత్తున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
నిన్నటితో ఈ-కేవైసీ నమోదు గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ దీన్ని నమోదు చేయించుకోని వారికి భారీ ఊరట దక్కింది.
 
కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్-వన్ రేషన్ పథకంలో భాగంగా లబ్దిదారులైన పేదలు ఏ రాష్ట్రంలో అయినా రేషన్ తీసుకునేందుకు వీలుగా ఈ-కేవైసీని తప్పనిసరిగా నమోదు చేయించాలని రాష్ట్రాలకు సూచించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ-కేవైసీ నమోదును ప్రారంభించింది. 
 
అయితే కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ఆధార్ కేంద్రాలతో పాటు ఈ-కేవైసీ నమోదు కేంద్రాలు పనిచేయకపోవడం, భారీ ఎత్తున పిల్లా పాపలతో లబ్ధిదారులు వీటికి పొటెత్తడంతో ఈ ప్రక్రియలో ఇభ్బందులు తలెత్తాయి. 
 
దీంతో ప్రభుత్వం ఈ-కేవైసీ తప్పనిసరి అయినప్పటికీ లబ్ధిదారుల్ని దృష్టిలో ఉంచుకుని పలు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది.