బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు

rain
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది పశ్చిమ దిశగా పయనించి తమిళనాడు, శ్రీంలక తీరంవైపు వెళుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు మరోమారు భారీ వర్ష ముప్పు పొంచివుందని హెచ్చరించింది. 
 
అల్పపీడన ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలోని అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఆ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, కాబట్టి మత్స్యుకారులు చేపల వేటకు వెళ్లవొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కాగా, శనివారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసిన విషయం తెల్సిందే. 
 
సజ్జల కుమారుడిపై అట్రాసిటీ కేసు... ఎక్కడ? 
 
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా పని చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు, వైకాపా సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిపై ఏపీ పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కడప జిల్లా పులివెందులలో ఈ కేసు నమోదైంది. ఈ జిల్లాలోని సింహాద్రిపురానికి చెందిన హరి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్ రెడ్డితో పాటు వైకాపా సోషల్ మీడియా కార్యకలాపాలను నిర్వహించే అర్జున్ రెడ్డి, వర్రా రవీంద్రారెడ్డిలపై పులివెందుల పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు. 
 
జగన్‌ను విమర్శించే వారిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో గత ఐదేళ్లుగా రవీంద్రారెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టిన విషయం తెల్సిందే. దీనిని ప్రశ్నించినందుకు తనను కులం పేరుతో దూషించాడంటూ హరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుతో ముగ్గురిపై అట్రాసిటీ కేసును నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.