మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 జనవరి 2021 (19:07 IST)

ప్రభుత్వ పరిపాలనలో మతపరమైన జ్యోక్యం విడనాడాలి: త్రిపురనేని సంస్మరణ కార్యక్రమంలో వక్తలు

ప్రభుత్వ పరిపాలనలో మత పరమైన జ్యోక్యం విడనాడాలని, రేపటి తరాన్ని ప్రశ్నించేతత్వం వైపు తీర్చిదిద్దాలని ఆంధ్రా ఆర్ట్స్ అకాడెమీ అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు ఉద్గాటించారు.

తెలుగునాట హేతువాద ఉద్యమాన్ని, సాహిత్యాన్ని అందించిన కవిరాజు త్రిపురనేని రామస్వామి 134వ జయంతి,      78వ వర్ధంతి సందర్భంగా స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో ఉన్న త్రిపురనేని విగ్రహం వద్ద శనివారం ఉదయం సాహిత్య సంఘాలు,హేతువాద సంఘాల ప్రతినిధుల సమావేశంలో గోళ్ళ నారాయణరావు మాట్లాడుతూ.. మూడ నమ్మకాలను నిర్ములన కోసం గత 100 యెల్ల క్రితమే పెరియార్, గోరా, సివి, త్రిపురనేని, చార్వాక రామకృష్ణ వంటి వాళ్లు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటు హేతువాద సాహిత్యానికి నాంది పలికి ముందుకు నడిపించారని అన్నారు.

నాస్తికకేంద్ర సంచాలకులు జి .నియంత ,ప్రజానాట్యమండలి నాయకులు ఆర్.పిచ్చయ్య మాట్లాడుతూ త్రిపురనేని గారి ఇల్లు నిత్య సాహిత్య కేంద్రంగా ఉండేదని ,కృష్ణాజిల్లా అంగలూరు లో పుట్టిన ఆయన న్యాయవాద వృత్తినిని వదులుకుని తెనాలి మున్సిపాలిటీ కి ఛైర్మన్ గా వ్యవహరించారని మత మూడ విశ్వాసాలపై యుద్ధం సాగించారని సూత పురాణం,శంభుకవధ వంటి పుస్తకాలు వ్రాసారని గుర్తుచేశారు.

అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యులు మూడ నమ్మకాల నిర్ములన చట్టసాధన సమితి కన్వీనర్ మోతుకూరి అరుణకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత త్రిపురనేని విగ్రాహం పై శాలువా కప్పారు.

జిల్లా గ్రంధాలయ సంఘ ప్రతినిధి పరుచూరి అజయ్ కుమార్,రామస్వామి కుటుంబానికి చెందిన పూర్నేందుమౌళి, హేతువాద, నాస్తిక సంఘ నాయకులు పామర్తి కొండలరావు, సర్వారెడ్డి, డి.భాస్కరరావు, మహిళా సమాఖ్య నాయకులు పంచదార్ల దుర్గంబ, పి.రాణి,తదితరులు పాల్గోన్నారు.