శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (08:20 IST)

ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్ సర్వీసుల పునరుద్ధరణ

ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్ సర్వీసులను పునరుద్ధరించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బస్సులు ప్రారంభమయ్యాయి. కృష్ణా రీజియన్ నుంచి హైదరాబాద్‌కు 15 బస్సులకు రిజర్వేషన్లు ప్రారంభించారు.

గతంలో కృష్ణా రీజియన్‌లో 264 బస్సులు నడిచేవి. అయితే ఇప్పుడు 166 బస్సులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ-హైదరాబాద్ మధ్య 1060 బస్సులు సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం ఆ సంఖ్యను కుదించారు.

600 వందల బస్సులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. గతంలో తెలంగాణ సుమారు 2 లక్షల 61 వేల కిలోమీటర్లు బస్సులు తీరిగేందుకు ఏపీఎస్ ఆర్టీసీకి అనుమతి ఉంది. అయితే రెండు రాష్ట్రాలు సరిసమానంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించినప్పటి నుండి ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. ఏడు నెలలుగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రెండు రాష్ట్రాల మధ్య చర్చలు సఫలం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.