రేవంత్ రెడ్డి తెలుగుదేశం కోవర్టు: రోజా
చంద్రబాబు, లోకేష్ పై ఏపీఐఐసీ చైర్మన్ రోజా విమర్శలు గుప్పించారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...రైతుల కోసం జగన్ నాలుగు అడుగులు ముందుకు వేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు.
వివిధ పథకాల ద్వారా 83 వేల కోట్ల రూపాయలను రైతులకు అందజేసిన ప్రభుత్వం జగన్‌ది అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో అక్క ఉమా....హరీష్ రావు...పోలీసులు కొట్టుకున్న విషయం లోకేష్ మర్చిపోయారా అంటూ యెద్దేవా చేశారు.
10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిలో ఉండకుండా పారిపోయి వచ్చింది లోకేష్ తండ్రి కాదా? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి తెలుగుదేశం కోవర్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసింది రేవంత్‌కి గుర్తు లేదా? అని ప్రశ్నించారు.
తమ ఇంటికి జగన్ ఏప్పుడూ రాలేదని, ఇక కేసీఆర్‌తో మంతనాలు ఎలా జరుపుతారని అడిగారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాన్ని పరిష్కారించవలసిన బాధ్యత కేంద్రానిదే అని రోజా స్పష్టం చేశారు.