బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 3 మే 2021 (20:03 IST)

తెలుగుదేశం పార్టీ మంచి నాయకుణ్ణి కోల్పోయింది- చంద్రబాబు నాయుడు

మాజీ ఎంపీ సబ్బంహరి మృతి నన్ను తీవ్రంగా కలిచివేస్తోందన్నారు చంద్రబాబు నాయుడు. ఆయన మాట్లాడుతూ... టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బంహరి మృతి నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సబ్బంహరి లేరన్న వార్తను నమ్మలేకపోతున్నాను. ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటారని ఆశించాను.

కానీ ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది. సబ్బంహరి మృతి పార్టీకి తీరని లోటు. ప్రజా సమస్యలపై స్పందించడంలో హరి ఎప్పుడూ ముందుండేవారు. విశాఖ మేయర్‌గా, లోక్‌సభ సభ్యులుగా సబ్బంహరి ప్రజలకు ఎనలేని సేవ చేశారు.

సబ్బంహరి మంచి వక్త. సమకాలీన రాజకీయాలపై సబ్బం హరికి మంచి పట్టుంది. ఏ అంశమైనా లోతైన విశ్లేషణ చేసేవారు. సబ్బంహరి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. హరి కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.