గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 3 మే 2021 (19:37 IST)

కృష్ణాజిల్లా నందిగామ హాస్పిటల్ బెడ్ పైనే మృతదేహం, ఎందుకంటే?

కృష్ణాజిల్లా నందిగామ హాస్పిటల్ బెడ్ పైనే మృతదేహం వుంది. వివరాలు చూస్తే.. వీరులపాడు మండలం కొనతాలపల్లి గ్రామానికి చెందిన 55 సంవత్సరాల కోట మార్తమ్మ అనే మహిళ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది.
 
నిన్న సాయంత్రం చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ హాస్పిటల్‌కి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం వచ్చిన మార్తమ్మ కు కరోనా టెస్ట్ చేయించారు హాస్పిటల్ సిబ్బంది. ఆసుపత్రిలో చికిత్స చేస్తుండగా మార్తమ్మ మృతి చెందింది.
 
మృతి చెందిన మార్తమ్మ మృతదేహాన్ని హాస్పిటల్ లోనే వదిలి వెళ్ళిపోయారు కుటుంబ సభ్యులు.
నిన్నటి నుండి హాస్పిటల్ బెడ్ పైనే మార్తమ్మ మృతదేహం వుంది. ఇటు కుటుంబ సభ్యులు కాని అటు హాస్పిటల్ సిబ్బంది కాని మార్తమ్మ మృతదేహాన్ని పట్టించుకోవడంలేదు.
 
కరోనా రిజల్ట్ వచ్చిన తర్వాతనే తీసుకువెళ్తామంటున్నారు కుటుంబ సభ్యులు. కాగా దీనిపై ఆసుపత్రి స్పందించలేదు.