శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:16 IST)

మూడు రోజుల్లో లాక్‌డౌన్ అమలు చేస్తాం, నా సొంత డబ్బుతో బెడ్లు: చెవిరెడ్డి

తిరుపతి: మూడు రోజుల్లో లాక్‌డౌన్ అమలు చేస్తామని.. ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి తుడా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉదయం 6గం నుంచి ఉదయం 10 గం వరకు మాత్రమే దుకాణాలు తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.

10 గంటల తరువాత ప్రజలు బయట తిరగకుండా ఆంక్షలు అమలు చేస్తామన్నారు. తన సొంత నగదుతో 25 లక్షలతో చంద్రగిరి నియోజకవర్గంలో 150 ఆక్సిజన్ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెవిరెడ్డి తెలిపారు.

చంద్రగిరి గవర్నమెంట్ హాస్పిటల్‌లో 100 ఆక్సిజన్ బెడ్లు, నారావారిపల్లి పీహెచ్‌సీలో 50  ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 10 వెంటిలేటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెవిరెడ్డి తెలిపారు