శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (12:17 IST)

మంగళగిరిలో లాక్డౌన్ తప్పదా?

గుంటూరు - విజయవాడ నగరాలకు మధ్యలో ఉన్న మంగళగిరి పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ తప్పేట్లు లేదని విశ్వసనీయ సమాచారం. కేసులు పెరుగుతున్న కారణంగా మంగళగిరిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
కేసులు పెరగటానికి స్వీయ తప్పిదమే కారణమా?
మంగళగిరి పట్టణంలో కేసులు పెరగటానికి ముఖ్యంగా మాస్కులు లేకుండా విచ్చల విడిగా తిరగటం... దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని పాటింపజేయడంలో విఫలమయ్యారు. 100కి 20 దుకాణాల్లో కూడా శానిటైజర్ అందుబాటులో ఉంచకపోవడం, గుంపులు గుంపులుగా టిఫిన్ స్టాల్స్, టీ దుకాణాలు, పానీ పూరి దుకాణాల మీద పడడం. 
 
‘నాడు’ తీసుకున్న ఏ జాగ్రత్తలు ‘‘నేడు’’ తీసుకోకపోవడం వలన కరోనా వ్యాప్తికి కారణాలుగా చెప్పుకోవచ్చు. దీంతో తిరిగి సమయపాలనతో దుకాణాలకు అనుమతిస్తారని తెలుస్తుంది. ఆ సమయాలు ఎలా అనేది నేటి సాయంత్రానికి తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆసుపత్రులలో మంచాలు లేక శ్మశానంలో స్థానం లేక భూమి మీదే ప్రత్యక్ష నరకం అనుభవించాల్సిందే.. తర్వాత ఏమి మిగలదు... గోడ మీద ఫోటో ప్రేమ్ తప్ప.