బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 12 ఏప్రియల్ 2021 (18:56 IST)

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక గృహిణి,ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నం

విజయవాడ గ్రామీణం నున్న గ్రాన కోటగట్టు సెంటర్‌లో విషాద ఘటన చోటుచేసుకున్నది. గత కొంతకాలంగా నున్న కోట గట్టు సెంటర్లో చిల్లరకొట్టు వ్యాపారం చేస్తు రాత్రి సమయంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు సురేంద్ర.
 
నిన్న రాత్రి 3 గంటల సమయంలో ఇంటికి వచ్చేసరికి భార్యాపిల్లలు పురుగులు మందు సేవించి నోటి నిండా నురగతో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో చికిత్స నిమిత్తం భార్యాపిల్లల్ని ఆసుపత్రికి తరలించాడు సురేంద్ర.
 
గుంటురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 3 ఏళ్ళ పాప భావన మృతి చెందింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నున్న గ్రామీణ పొలీసులు.