సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 మే 2022 (21:48 IST)

14 ఏళ్ల విద్యార్థిపై ఆర్ఎంపీ వైద్యుడు అత్యాచారం..

rape
ఏపీలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కోనసీమలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
మామిడికుదురు మండలంలో ఏడో తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థిపై ఆర్‌ఎంపీ వేగి రమేశ్‌ వైద్యం చేసేందుకు ఆరు నెలల కిందట బాలిక ఇంటికి వచ్చి ఆమె వద్ద ఫోన్‌ నెంబర్‌ తీసుకుని పరిచయం పెంచుకున్నాడు.
 
సోమవారం రాత్రి తండ్రి ఇంట్లో నిద్రిస్తుండగా బాలిక డాబాపై పడుకున్న సమయంలో వైద్యుడు అక్కడికి చేరుకుని బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.