ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్: ఓ యువకుడు మృతి.. మరో యువకుడి పరిస్థితి?
ఇబ్రహీంపట్నంలో గ్యాంగ్ వార్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. ఇబ్రహీంపట్నం హైవే పక్కనే యువకుల ఘర్షణకు దిగారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో పిడిగుద్దులతో.. కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ గొడవలో ఓ యువకుడు చనిపోయాడని.. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వైరల్ అయ్యాయి.
విజయవాడ నుంచి వచ్చిన కొందరు యువకులు.. స్థానిక యువకులతో గొడవ పడ్డారని తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని జూపూడి గ్రామ శివారులో డాక్టర్ ఎన్టీటిపీస్ బూడిద కరకట్ట నుండి మురుగు నీరు వాటర్ ఫాల్స్ తరహాలో వస్తుంటుంది.
ఇటీవల కాలంలో కొంతమంది యువకులు అక్కడికి వస్తున్నారని.. సరదాగా నీటిలో ఆడుతూ ఉంటారని స్థానికులు తెలిపారు. ఆదివారం నాడు ఫ్రెండ్‌షిప్ డే, ఆదివారం కావడంతో యువకులు ఎక్కువ సంఖ్యలో అక్కడికి వచ్చారు. అయితే ఊహించని విధంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనలో ఇబ్రహీంపట్నం గ్యాంగ్ వార్ కేసులో పది మంది అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ హనుమంతరావు తెలిపారు. గ్యాంగ్ వార్ సభ్యుల గాలించడం కోసం పోలీసులు రెండు బృందాలు ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.