సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 17 జనవరి 2022 (19:48 IST)

కియా కార్ల కంపెనీకి మంత్రి శంకర నారాయణ క్లాస్

పెనుకొండ నియోజకవర్గ పరిధిలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) కింద నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టాలని కియా, కియా అనుబంధ సంస్ధల ప్రతినిధులకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ సూచించారు. సోమవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో కియా, కియా అనుబంధ సంస్ధల ప్రతినిధులతో  కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) యాక్టివిటీల కింద అభివృద్ధి పనులు చేపట్టడంపై మంత్రి సమీక్షించారు. ఈ సమావేశం లో కియా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,పెనుకొండ నియోజకవర్గ పరిధిలోని మేజర్ పంచాయతీలు, గ్రామాలలో కియా,కియా అనుబంధ సంస్ధలు తాగు నీటి వసతి, విద్యుత్, పారిశుద్ధ్య పనులు,ఇతర ముఖ్య పనులతో పాటు వారు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో గుర్తించిన పనులను సిఎస్ఆర్ యాక్టివిటీల కింద చేపట్టాలన్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు తమ నిధులు ఖర్చు చేయడంతో పాటు  వారి ఆధ్వర్యంలో సంబంధిత అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి సూచించారు.