శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బీహార్‌లో నూడుల్స్ కంపెనీలో భారీ పేలుడు - ఆరుగురు మృత్యువాత!

బీహార్ రాష్ట్రంలో ఘోర్ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో ఉన్న నూడుల్స్ కంపెనీలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ కారణంగా ఏర్పడిన అగ్నిప్రమాదం వల్ల ఆరుగురు మృత్యువాతపడినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సహాయక సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఇదిలావుంటే, ఈ పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదానికి ఈ కంపెనీలోని బాయిలర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.