ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (16:28 IST)

నగరి ఎన్నికల్లో ఆర్కే రోజా భారీ మెజారిటీతో గెలుస్తారు.. అలీ

rk roja
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చిత్తూరులో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు, ఇందులో వైఎస్సార్సీపీ నేత, సినీ నటుడు అలీ పాల్గొన్నారు. 
 
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదలను, సామాన్యులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ఈ కార్యక్రమం అనంతరం అలీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రయోజనాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 
 
నగరి ఎన్నికల్లో మంత్రి ఆర్కే రోజా భారీ మెజారిటీతో గెలుస్తారని, రాష్ట్రానికి మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని అలీ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి వైఎస్సార్‌సీపీ 175 సీట్లు గెలుచుకుంటుందని పునరుద్ఘాటించారు.

సీఎం జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్‌పై పోటీ చేస్తానని అలీ ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు మంచి మిత్రుడని కానీ వచ్చే ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. 
 
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన అలీ, జగన్ ఆదేశాల మేరకు ఎక్కడైనా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.