1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 మే 2024 (12:13 IST)

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ttd devotees in q line
తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు 3 కిలోమీటర్ల మేరకు భక్తులు వరుసలో నిల్చొనివున్నారు. అదేసమయంలో శ్రీవారి దర్శనం కోసం కనీసం 24 గంటల సమయం పట్టేలా ఉంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో మరికొన్ని రోజులు రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 
 
తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిటకిటలాడుతున్నాయి. క్యూలైన్లలో నిల్చొనివున్న భక్తులకు అధికారులకు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. టీటీడీ ఈవో వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, టీటీడీ భద్రతాధికారులు ఎప్పటికపుడు వరుస లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.