మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (17:03 IST)

ప్రభుత్వ సంక్షేమ పథకాలను దురుద్దేశంతో అడ్డుకుంటున్నారు: సజ్జల

ప్రభుత్వ సంక్షేమ పథకాలను దురుద్దేశంతో అడ్డుకుంటున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ దుయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొన్ని రాజకీయ శక్తులు వికృత చర్యలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థలను స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తప్పుబట్టారు. ఏపీలో 5 కోట్ల జనాభా ఉంటే ఇళ్లు లేనివారు 31 లక్షల మంది ఉన్నారని తెలిపారు. పేదల సొంతింటి కలను టీడీపీ అడ్డుకుంటోందని, సీఎం జగన్‌కు ప్రజాదరణ చూసి టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.
 
మ‌రో ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు దీనిని ఖండిస్తూ, వైసీపీనే కోర్టులో వ్యాజ్యం వేయించింద‌ని ఆరోపించారు. జ‌గ‌న‌న్న కాల‌నీల‌కు ఇళ్ల నిర్మాణాల‌కు కేంద్రం ఇచ్చిన 2 వేల కోట్లు దుర్వినియోగం చేశార‌ని, ఇపుడు ఆ డ‌బ్బు లేక‌, కావాల‌నే కోర్టు కేసు వేయించి, దానిని టీడీపీకి ఆపాదిస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.