మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 8 అక్టోబరు 2021 (11:13 IST)

బాప‌ట్ల టీడీపీ కార్యాలయ నిర్మాణంపై అధినేత చంద్రబాబుతో చ‌ర్చ‌

గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణం అద్భుతంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, బాపట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ లు, బాపట్ల పార్లమెంట్ కార్యాలయం నిర్మాణంపై అధినేతకు వివరించారు. 
 
బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి బాపట్లకు చెందిన కీర్తిశేషులు మువ్వా సుబ్బారావు 9 సెంట్ల భూమిని అందించారని అధినేతకు తెలిపారు. పార్టీ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి సమగ్ర మ్యాప్ లు, ప్రణాళికను అధినేత తిలకించారు. నాయకులు అందరూ సమిష్టిగా పార్టీ కార్యాలయ నిర్మాణానికి పూనుకోవాలని, పార్టీ కార్యాలయం మంచి వాతావరణం ఉండేలా అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో  పార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్ బాబు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తాని కొండ దయ బాబు, పార్టీ సీనియర్ నాయకులు జీవి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.