శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 మే 2020 (21:39 IST)

రాష్ట్రంలో ఇసుక నిల్వ‌లు మ‌రింత‌గా పెంచాలి: మంత్రి పెద్దిరెడ్డి

రాష్ట్రంలో ఇసుక నిల్వ‌లు మ‌రింత‌గా పెంచాల‌ని తో రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తాడేపల్లిలోని పిఆర్ కమిషనర్ కార్యాలయంలో మైనింగ్, ఎపిఎండిసి అధికారులతో ఆయ‌న మంగ‌ళ‌వారం సమీక్షా సమావేశం నిర్వ‌హించారు.

మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సీఎం కార్యదర్శి సోలోమన్ ఆరోఖ్యరాజ్, ఎపిఎండిసి విసిఅండ్ ఎండి మధుసూదన్ రెడ్డి, డిఎంజి వెంకటరెడ్డి తదితరులు ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలం కోసం ఇసుక నిల్వలను మరింతగా పెంచాల‌న్నారు.

ఇప్పటికే ముప్పై లక్షల టన్నుల ఇసుక సిద్దంగా వుంద‌ని తెలిపారు. "జూన్ మాసాంతానికి అరవై లక్షల టన్నులకు ఇసుకను పెంచాలి. రాష్ట్రంలోని చెక్ పోస్ట్ లను మరింత పటిష్టం చేయాలి. ఇప్పటికే ఇసుక, మద్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎక్కడా ఇసుక అక్రమాలు జరగకుండా అధికారులు బాధ్యత వహించాలి.

మైనింగ్ శాఖ నుంచి కేటాయించిన జిల్లా శాండ్ అధికారుల పర్యవేక్షణలో ఇసుక విక్రయాలు, రవాణా. ఎక్కడైనా అక్రమరవాణా జరుగుతున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవు. అన్ని రీచ్ లు, స్టాయి పాయింట్లలో సిసి కెమేరాలతో రియల్ టైం మానిటరింగ్ చేయాలి. రీచ్‌లకు అందుబాటులో వేయింగ్ మిషన్ లను ఏర్పాటు చేయడం ద్వారా ఓవర్ లోడింగ్ ను అరికట్టాలి.

జిపిఎస్ వాహనాలతో ఇసుక రవాణాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. నూతన ఇసుక పాలసీ వల్ల సామాన్యుడికి మేలు జరగాలి. ఇసుక మాఫియా వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు కొత్త పాలసీ ఊరట అందించాలి. అత్యంత పారదర్శకతతో ఇసుకను నిర్మాణదారుల చెంతకు చేర్చాలి. మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా అక్రమం జరుగుతుందని తెలిస్తే వెంటనే స్పందించాలి" అని తెలిపారు.