మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 6 నవంబరు 2020 (19:31 IST)

తిరుమలలో పరిశుభ్రత చర్యలు భేష్ - జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

కోవిడ్ నేపథ్యంలో తిరుమలలో చేసిన ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయని మెచ్చుకున్నారు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. పరిశుభ్రతా చర్యలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్నారు లెఫ్టినెంట్ గవర్నర్.
 
ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్సించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. భక్తుల ఆరోగ్య భద్రతతను దృష్టిలో ఉంచుకుని పటిష్టంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టారని టిటిడి యంత్రాంగాన్ని కొనియాడారు. 
 
టిటిడి ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి లెఫ్టినెంట్ గవర్నర్‌కు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. దర్సనం తరువాత ఛైర్మన్‌ను ప్రసంసించారు జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. మొదటిసారి జమ్ముకాశ్మీర్ గవర్నర్ హోదాలో తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు మనోజ్ సిన్హా.