సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 31 అక్టోబరు 2020 (22:50 IST)

Full Moon Seva శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ

తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం సాయంత్రం పౌర్ణమి గరుడసేవ జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారిని అలంకరించి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేంచేపు చేశారు.

కోవిడ్-19 కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, డెప్యూటీ ఈవో శ్రీ వెంక‌ట‌య్య‌, పోటు పేష్కార్ శ్రీ శ్రీ‌నివాసులు తదితరులు పాల్గొన్నారు.