ఏపీలో భారీ వర్షాలు... చిత్తూరు జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా ఏపీతో పాటు తమిళనాడు రాష్ట్రాలలో కుంభవృష్టి కురుస్తుంది. గత కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అయితే శుక్రవారం కూడా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తు అక్కడి కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
గురువారం కూడా ఈ జిల్లాలలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వర్షాల వల్లే ఎలాంటి ఇబ్బందులు ఎదురు అయినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఇప్పటికే ఈ జిల్లాలలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యం నిలిచిపోయాయి.