ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (14:30 IST)

ఏపీలో భారీ వర్షాలు: జగన్ సమీక్ష... బాధితులకోసం ఫోన్‌ నంబర్‌

భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల కలెక్టర్లతో సీఎం వైయస్‌.జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప కలెక్టర్లు, అధికారులతో క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయని… తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీ కన్నా ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్తున్నారన్నారు. 
 
నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని… ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు జగన్‌. ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయని…రెండు బృందాలు ఇప్పటికే నెల్లూరు చేరుకున్నాయని తెలిపారు.  
 
అవసరమైన చోట సహాయ శిబిరాలు తెరవండని…సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోవాలని పేర్కొన్నారు. బాధితులకు వేయి రూపాయల చొప్పున వారికి అందించాలని… బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏం కావాలన్నా.. వెంటనే అడగాలని… బాధితులకోసం ఒక ఫోన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు సీఎం జగన్.