బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 4 జులై 2019 (12:34 IST)

కొలువు కోసం వెళితే కోర్కె తీర్చుకున్న గుంటూరు డీఎఫ్‌వో అధికారి!

ప్రభుత్వం ఉద్యోగం కోసం వెళితే ఉన్నత స్థానంలో ఉన్న అధికారి ఒకరు కోర్కె తీర్చుకుని మోసం చేశాడనీ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ అధికారి పేరు కె. మోహన్ రావు. గుంటూరు జిల్లా అటవీ శాఖాధికారి. ఆయనపై గుంటూరు పట్టణానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పైగా, ప్రభుత్వం ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద రూ.2 లక్షల మేరకు డబ్బులు తీసుకున్నాడని ఆ మహిళ పేర్కొంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ డిఫార్మసీ పూర్తిచేసింది. ఈమెక 2009లో వివాహమైంది. అయితే, మనస్పర్థల కారణంగా భర్తతో విడాకులు తీసుకుంది. తన కుమార్తె, తల్లితో కలిసి నివశిస్తోంది.
 
ఈ నేపథ్యంలో గుంటూరు అటవీశాఖ కార్యాలయంలో ఉద్యోగాలున్నాయని తెలుసుకున్న ఆమె, ఫిబ్రవరిలో జిల్లా అటవీశాఖాధికారి మోహన్‌ రావును కలిసింది. ఆపై ఆమె సర్టిఫికెట్లు, సెల్‌ నంబరు తీసుకుని, ఫోన్ చేసి, ఉద్యోగ విషయం మాట్లాడాలని పిలిపించాడని వెల్లడించింది. 
 
తన కార్యాలయంలో క్లర్క్ పోస్టు ఇప్పిస్తానని తదుపరి పర్మినెంట్ అవుతుందని నమ్మబలికి, అందుకు రూ.4 లక్షలు ఇవ్వాల్సివుంటుందని అనగా, అంత ఇచ్చుకోలేనని చెప్పిన ఆ యువతి, రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకుని ఆ డబ్బు ఇచ్చానని వెల్లడించింది.
 
కొన్ని రోజులకు ఉద్యోగం గురించి అడుగగా, కేవలం డబ్బులిస్తే చాలదని, తన కోరిక తీర్చాలని చెప్పి లొంగదీసుకున్నాడని, ఆపై ఆదివారాలు, సెలవు రోజుల్లో తన కార్యాలయానికి పిలిపించుకొని తనను లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించింది. ఆపై ఉద్యోగం గురించి అడుగగా, లేదన్నాడని, ఈ విషయమై అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది.