సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 4 జులై 2019 (10:09 IST)

సీబీఐ ఎస్పీగా ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారిణి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారిణి ఆర్‌.జయలక్ష్మి సీబీఐ ఎస్పీగా నియామకమయ్యారు. 2006 బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం గుంటూరు రూరల్‌ ఎస్పీగా ఉన్నారు. జయలక్ష్మితోపాటు ఢిల్లీలో డీసీపీగా ఉన్న 2007 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిణి నుపుర్‌ ప్రసాద్‌ను కూడా సీబీఐ ఎస్పీగా కేంద్రం నియమించింది.
 
వీరిద్దరూ నాలుగేళ్లపాటు సీబీఐలో పనిచేస్తారు. అయితే బదిలీపై ఇంకా ఆర్డర్స్ రాలేదు. కానీ, రూరల్ జిల్లాకి నూతన ఎస్పీని నియమించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలో కూడా నలుగురు ఎస్పీలను సీబీఐలో నియమించారు.