గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (14:50 IST)

సిద్ధిపేటలో ఎస్ఐ ఆత్మహత్య... అదే గదిలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని..?

సిద్ధిపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంతోనే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే పోలీస్ స్ట

సిద్ధిపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల వేధింపుల కారణంతోనే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే పోలీస్ స్టేషన్లో పనిచేసిన రామకృష్ణారెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను ప్రభాకర్ రెడ్డు కుటుంబీకులు గుర్తు చేస్తున్నారు. 
 
కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన రామకృష్ఠారెడ్డి గత ఏడాది ఆగస్టు మాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకున్న గదిలోనే ప్రభాకర్ రెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకొన్న తర్వాత ఆయన స్థానంలో గత ఏడాది ప్రభాకర్ రెడ్డి విధుల్లో చేరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ జరపాల్సిందిగా పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.