శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: బుధవారం, 2 జనవరి 2019 (21:09 IST)

చుక్కల భూములతో చంద్రబాబుకు చుక్కలు చూపించబోతున్నారు... ఎవరు?

సినీ నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి భారీ కుట్ర జరుగబోతోందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఏపీ సీఎంను టార్గెట్ చేసిందనీ, ఈసారి వారి వ్యూహం వేరేగా వున్నదని చెప్పుకొచ్చాడు. 
 
చుక్కల భూముల రైతులను ప్రభుత్వంపై ఉసిగొల్పి వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఓట్లు రాకుండా చేసేందుకు పన్నాగం పన్నుతున్నారంటూ వెల్లడించారు. ఈ చుక్కల భూములను ఈస్ట్ ఇండియా కంపెనీ రెగ్యులరైజ్ చేసిందనీ, ఐతే వీటి పేరుతో భారీ కుట్రకు తెరతీసేందుకు వ్యూహరచన చేస్తున్నారంటూ వెల్లడించారు శివాజీ. శివాజీ ఆ ఫైల్‌ను కొంతమంది అధికారులు తొక్కిపెట్టారని పేర్కొన్నారు.